ఏపీపీఎస్సీ గ్రూప్-1 అభ్యర్థుల ఎంపికను పారదర్శకంగా చేపట్టాలని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిజిటల్ మూల్యాంకణం అనేక అనుమానాలకు తావిస్తున్నందున.. వాటన్నిటినీ నివృత్తి చేసి సాంకేతికతపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ... సీఎం జగన్కు లేఖ రాశారు. గ్రూప్-1 ద్వారా ఎంపికైన అభ్యర్థులు సబ్ కలెక్టర్లుగా, ఆర్డీవోలుగా, ఇతర ఉన్నతాధికారులుగా సేవలందించాల్సి ఉన్నందున.. లోపాలు, పక్షపాతం లేకుండా పరీక్షా విధానం న్యాయంగా ఉండటం ఎంతో ముఖ్యమని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:దిల్లీ, కేరళలో కరోనా కేసులు తగ్గుముఖం
గత విధానాలకు విరుద్ధంగా అభ్యర్థుల ఎంపిక, మూల్యాంకణం ఉన్నాయని.. అవి ఆయా అభ్యర్థులకు శాపం కాకూడదని లోకేశ్ లేఖలో పేర్కొన్నారు. భౌతిక మూల్యాంకణం కోసం రూపొందించిన జవాబు పత్రాలను.. డిజిటల్ పద్ధతిలో చేయడం వల్ల అర్హులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. వచ్చే నెలలో ఇంటర్వ్యూ రౌండ్ ప్రారంభం కానున్నందున.. అభ్యర్థుల డిమాండ్లను పరిగణలోకి తీసుకోవాలని కోరారు.