ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మాస్క్ పెట్టుకోకుండా ఏం మెసేజ్ ఇస్తున్నారు..?: లోకేశ్ - Nara Lokesh Latest News

సీఎం జగన్​పై నారా లోకేశ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. మాస్క్ పెట్టుకోకుండా ముఖ్యమంత్రి ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రం శ్మశానంగా మారుతున్నా... మార్పు రాదా అన్ని ట్వీట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్​కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

సీఎం జగన్​పై నారా లోకేశ్ మరోసారి హాట్ కామెంట్స్
సీఎం జగన్​పై నారా లోకేశ్ మరోసారి హాట్ కామెంట్స్

By

Published : May 20, 2021, 4:54 PM IST

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాస్క్ ధరించి మనిషినని నిరూపించుకుంటారా లేక మాస్క్ పెట్టుకోకుండా మూర్ఖుడిగానే ఉంటారా..? అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. మాస్క్ పెట్టుకోకుండా ముఖ్యమంత్రి ప్రజలకేం సంకేతాలిస్తున్నారని ట్విటర్​లో నిలదీశారు. మాస్క్ ధరించటం తప్పనిసరని తన ఫొటో, పేరుతో కోట్లాది రూపాయలు ప్రకటనలిస్తున్న ముఖ్యమంత్రే మూర్ఖంగా మాస్క్ పెట్టుకోక‌పోతే, ఇక మంత్రులూ, ఎమ్మెల్యేలూ మాస్కులెందుకు ధ‌రిస్తారని ప్రశ్నించారు.

తొలి విడ‌త‌లో కొవిడ్ వైర‌స్​ను తేలిగ్గా తీసుకుని వేలాదిమందిని బ‌లిచ్చారని మండిపడ్డ లోకేశ్‌... రెండో దశలో రాష్ట్రం శ్మశానంగా మారుతుంటే చిరున‌వ్వులు చిందిస్తూ, మాస్క్ ధ‌రించ‌కుండా ఇంకెంత మంది ప్రాణాలు ప‌ణంగా పెడ‌తారని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి మాస్క్ లేకుండా అసెంబ్లీ సమావేశానికి హాజరైన ఫొటోను తన ట్విటర్ ఖాతాకు జత చేశారు.

జూనియర్ ఎన్టీఆర్​కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ లోకేశ్ మరో ట్విట్‌ చేశారు. ఇలాంటి సంతోషకరమైన పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు లోకేశ్‌ ట్వీట్ చేశారు.

ఇదీ చదవండీ... ఏపీ డెయిరీ ఆస్తుల వ్యవహారం: 'జీవో నెం.117 రాజ్యాంగ విరుద్దం'

ABOUT THE AUTHOR

...view details