ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విద్యార్థులు బలి కావాలా?: లోకేశ్‌

ప్రభుత్వంపై తెదేపా నేత నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కరోనా కట్టడిలో వైకాపా సర్కార్ పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.

lokesh
ప్రభుత్వంపై నారా లోకేశ్ మండిపాటు

By

Published : Apr 24, 2021, 2:08 PM IST

Updated : Apr 25, 2021, 5:39 AM IST

కరోనా ఉద్ధృతంగా ఉన్నందున పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు చేస్తున్న విజ్ఞప్తిని ముఖ్యమంత్రి జగన్‌ పెడచెవిన పెట్టి మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. పరీక్ష కేంద్రాలు సూపర్‌స్ప్రెడర్లుగా మారే అవకాశం ఉందని.. విద్యార్థులు, వారి కుటుంబీకులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది కలిపి మొత్తం 80 లక్షల మంది ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన శనివారం తెదేపా కేంద్ర కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌లో విలేకరులతో మాట్లాడారు.

ప్రభుత్వంపై నారా లోకేశ్ మండిపాటు

‘పరీక్షలు వాయిదా వేయాలని లోకేశ్‌ లేఖ రాశాడు కాబట్టి... ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయడానికి లేదని సీఎం స్పష్టం చేశారు. నా కుమారుడు దేవాన్ష్‌ ఇప్పుడు పదో తరగతిలో ఉంటే గనుక పరీక్షలు రాయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పంపేవాణ్ని కాదు. నాలాంటి లక్షలాది తల్లిదండ్రులు ఇలాగే భయపడుతున్నారు. జగన్‌ మాత్రం పరీక్షలు మాత్రం జరగాల్సిందేనని అంటున్నారు’ అని లోకేశ్‌ వివరించారు. ‘మేం టౌన్‌హాల్‌ సమావేశం ఏర్పాటుచేసి పరీక్షల వాయిదాకు ప్రభుత్వానికి 48 గంటల గడువునిచ్చాం. దీనిపై స్పందన లేదు. వాట్సాప్‌లో అభిప్రాయాలను సేకరిస్తే.. 1,55,850 మంది పరీక్షలను వాయిదా వేయాలని కోరారు. 70 వేల మంది కామెంట్స్‌ పెట్టారు’ అని తెలిపారు. పరీక్షల రద్దుపై అవసరమైతే న్యాయపోరాటం చేస్తామన్నారు. విశాఖలో శుక్రవారం ఒక్కరోజే, ఒక శ్మశానవాటికలో 18 కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తే... ప్రభుత్వ లెక్కల్లో మాత్రం ఇద్దరే చనిపోయినట్టు చూపించారని లోకేశ్‌ వివరించారు.

ఇదీ చదవండి:సంగం డెయిరీ కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీలు

Last Updated : Apr 25, 2021, 5:39 AM IST

ABOUT THE AUTHOR

...view details