ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రైతు నెత్తిపై మీటర్ మోత ఎందుకో సీఎం చెప్పాలి: లోకేశ్ - lokesh comments on jagan

బిల్లు ప్రభుత్వం కట్టేలా ఉంటే రైతు నెత్తిపై మీటర్ మోత ఎందుకో సీఎం జగన్ చెప్పాలని నారా లోకేశ్‌ డిమాండ్ ‌చేశారు. మాయ మాటలు చెప్పి రైతులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

nara-lokesh-fires-on-jagan-over-new-meters-for-agriculture-bores
లోకేశ్

By

Published : Sep 10, 2020, 10:57 PM IST

ఉచిత విద్యుత్ ఎత్తేయడానికే నగదు బదిలీ స్కెచ్ అంటూ... జగన్ రెడ్డి మనస్సాక్షి నాడు పతాక శీర్షికలు ప్రచురించిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ గుర్తు చేశారు. నాడు పైరుకు వైర్ కట్ అని, నేడేమో క్రమబద్ధీకరణ, బిల్లులు తామే చెల్లిస్తాం అంటూ... రైతులను బలితీసుకోవడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బిల్లు ప్రభుత్వం కట్టేలా ఉంటే రైతు నెత్తిపై మీటర్ మోత ఎందుకో తుగ్లక్ సీఎం చెప్పాలని లోకేశ్‌ డిమాండ్ ‌చేశారు.

ABOUT THE AUTHOR

...view details