ప్రాణం విలువ బాగా తెలిసిన జగన్ రెడ్డి పట్టించుకోకపోవడం వల్ల సునీల్ లాంటి అభాగ్యులు ఇప్పటివరకూ 10 వేలమందికి పైగానే కరోనాతో ప్రాణాలు వదిలారని... తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. తల్లిని కోల్పోయిన సునీల్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ... కేజీహెచ్ కొవిడ్ వార్డు నుంచే లైవ్ వీడియో పెట్టినా స్పందించకపోవటంతో 19న కన్నుమూశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రాణం విలువ తెలిసిన వారెవ్వరూ స్పందించకుండా ఉండరు: లోకేశ్ - Nara Lokesh Latest tweets
సీఎం జగన్‌పై తెదేపా ముఖ్యనేత నారా లోకేశ్ మరోసారి ట్విటర్ వేదికగా హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలకు ప్రాణం విలువ తెలిసిన వారెవ్వరూ స్పందించకుండా ఉండరని వ్యాఖ్యానించారు. జగన్ రెడ్డి పట్టించుకోకపోవడం వల్ల సునీల్ లాంటి అభాగ్యులు ఇప్పటివరకూ 10 వేలమందికి పైగానే కరోనాతో ప్రాణాలు వదిలారని ఆక్షేపించారు.
లోకేశ్
సునీల్ చదువుకున్నాడు కాబట్టి ట్వీట్ ద్వారా తెలిసిందన్న లోకేశ్... నిరక్షరాస్యులు, కార్మికులు, పేదలు రోజూ వేల మంది కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తూ మృత్యువాతపడుతూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలకు ప్రాణం విలువ తెలిసిన వారెవ్వరూ స్పందించకుండా ఉండరని, సునీల్‌కు సంబంధించిన వీడియోను లోకేశ్ తన ట్విటర్ ఖాతాకు జత చేశారు.
ఇదీ చదవండీ... తెదేపా కార్యకర్తలపై పోలీసుల తీరు దారుణం : లోకేశ్