తమ కార్యకర్తల విమర్శలకు సమాధానం చెప్పే దమ్ములేక కేసులు పెట్టే జగన్ రెడ్డి నాయకుడో.. ధైర్యం లేని దద్దమ్మో వైకాపా శ్రేణులు తేల్చుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేయాల్సిన ఒక మంత్రితో ప్రతిపక్ష నాయకుడిన బూతులు తిట్టించి ఆనందపడిన రోజు జగన్ రెడ్డికి చట్టాలు, మర్యాద, సాంప్రదాయాలు గుర్తు రాలేదా అని నిలదీశారు. రాజారెడ్డి రాజ్యాంగంలో బూతులు తిట్టిన వైకాపా నాయకులపై చర్యలు ఉండవని రాసుకున్నారా అని ప్రశ్నించారు. తాము కూడా తిట్టగలం కానీ మా పార్టీ సంస్కృతి అది కాదని చెప్పినందుకు... టీఎన్ఎస్ఎఫ్ మాజీ అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మంపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తారా అని ధ్వజమెత్తారు. బ్రహ్మంకి పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
రాజారెడ్డి రాజ్యాంగంలో ఇలాగే రాసుకున్నారా..?: లోకేశ్ - జగన్పై లోకేశ్ కామెంట్స్
తమ కార్యకర్తల విమర్శలకు సమాధానం చెప్పే ధైర్యం లేకే అక్రమ కేసులు పెట్టారని నారా లోకేశ్ పేర్కొన్నారు. రాజారెడ్డి రాజ్యాంగంలో ఇలాగే రాసుకున్నారా..? అని ప్రశ్నించారు. టీఎన్ఎస్ఎఫ్ మాజీ అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మంకు తెదేపా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
లోకేశ్