ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అటెండర్ దగ్గర నుంచి ఐఏఎస్ దాకా.. అందరూ వారే : నారా లోకేశ్

వైకాపా పాలనలో సామాజిక న్యాయం ఎక్కడ ఉందని.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్ లోపల సజ్జలరెడ్డి, సాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి ఉంటే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలను గేటు బయటే ఉంచారని ఆవేదన వ్యక్తంచేశారు.

NARA LOKESH
NARA LOKESH

By

Published : May 29, 2022, 7:55 PM IST

వైకాపా పాలనలో సామాజిక న్యాయం ఎక్కడ అని తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ నిలదీశారు. తాడేపల్లి ప్యాలెస్ లోపల సజ్జల రెడ్డి, సాయి రెడ్డి, సుబ్బా రెడ్డి, పెద్ది రెడ్డి.. బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలు గేటు బయట అని ఆవేదన వ్యక్తం చేశారు. అటెండర్ దగ్గర నుంచి ఐఏఎస్ వరకూ ఒకే సామాజిక వర్గం వారికి.. రెండు వేల కీలక పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. కుర్చీలు కూడా లేని పదవులు బీసీలకు ఇచ్చారని దుయ్యబట్టారు.

ఇలాంటి పరిస్థితుల్లో వైకాపా సర్కారు చేయాల్సింది సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర కాదని.. జగన్ రెడ్డి సామాజిక రైలు యాత్ర అని ధ్వజమెత్తారు. వాస్తవానికి రైలు కూడా సరిపోనన్ని పదవులు.. ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారని ఆక్షేపించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details