సీఎం రమేశ్ కొడుకు పెళ్లికి తాను దుబాయ్ వెళ్లానంటూ... వైకాపా తప్పుడు ప్రచారం చేస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. 2015లో తను అమెరికా పర్యటనకు వెళ్లిన... పాత ఫొటోలతో కొత్త కథ అల్లారని దుయ్యబట్టారు. వైకాపా పేటీఎమ్ బ్యాచ్ ఆవేశం చూస్తే నవ్వొస్తుందన్న లోకేశ్... అకౌంట్లో జగన్ వేసే చిల్లర పడితే చాలు... ఇంగిత జ్ఞానం లేకుండా రెచ్చిపోతున్నారని ఆక్షేపించారు. ఇంకా పోస్ట్‌కి 5 రూపాయలే ఇస్తున్నారా...? అని ప్రశ్నించారు. కాస్త ఎక్కువైనా అడగండని ఎద్దేవా చేశారు. కోట్లలో జే ట్యాక్స్ వసూలు చేస్తున్న జగన్... తప్పుడు పోస్టులు పెట్టేవారికి మాత్రం 5 రూపాయలే వేస్తే ఎలా..? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
పాత ఫొటోలతో వైకాపా తప్పుడు ప్రచారం చేస్తోంది: లోకేశ్ - సీఎం జగన్ పై లోకేష్ కామెంట్స్ వార్తలు
భాజపా ఎంపీ సీఎం రమేశ్ కొడుకు పెళ్లికి తాను దుబాయ్ వెళ్లానంటూ... వైకాపా తప్పుడు ప్రచారం చేస్తోందని నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత ఫొటోలతో కొత్త కథలు అల్లుతున్నారని ధ్వజమెత్తారు
nara-lokesh-fire-on-ycp-over-fake-photos-viral-on-him