ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పరీక్షలు నిర్వహిస్తామనడం సీఎం మూర్ఖత్వానికి నిదర్శనం' - జగన్మోహన్ రెడ్డి పై మండిపడ్డ నారా లోకేశ్

విద్యార్థుల పాలిట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంసుడు అని తేలిపోయిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. అన్ని రాష్ట్రాలు పరీక్షలు వాయిదా వేస్తుంటే ఒక్క ఏపీలోనే పరీక్షలు నిర్వహిస్తామని జగన్ ముందుకు వెళ్లడం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమని మండిపడ్డారు.

nara lokesh
నారా లోకేశ్

By

Published : Apr 28, 2021, 4:32 PM IST

విద్యార్థులు బతికుంటేనే.. వారి భవిష్యత్తనే విషయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రహించాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యాదర్శి నారా లోకేశ్ హితవు పలికారు. విద్యార్థుల పాలిట జగన్.. కంసుడు అని తేలిపోయిందని ఎద్దేవా చేశారు. కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా కేంద్రం, దాదాపు అన్ని రాష్ట్రాలు పరీక్షలు రద్దు లేదా, వాయిదా వేయశాయన్న లోకేశ్.. ఒక్క ఏపీలోనే పరీక్షలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ముందుకు వెళ్లడం మూర్ఖత్వానికి నిదర్శనమని మండిపడ్డారు.

విద్యార్థుల భవిష్యత్తూ అంటూ దీర్ఘాలు తీస్తున్న జగన్​రెడ్డి అధ్వానపాలనలో వారు బతికి ఉండాలి కదా అని దుయ్యబట్టారు. అంబులెన్సులు రాక, ఆక్సిజ‌న్ లేక జ‌నం పిట్టల్లా రాలిపోతున్నారన్నారని విమర్శించారు. క‌రోనా శ‌వాల‌తో మార్చురీలు నిండిపోతే, అంత్యక్రియ‌ల‌కు శ్మశానాల‌లో క్యూలు కడుతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో బెడ్డు దొర‌క్క రోడ్డుపైనే కుప్ప కూలిపోతున్నారన్నారు. ఇవ‌న్నీ ప‌ట్టించుకోకుండా ప‌రీక్షల పేరుతో 15 ల‌క్షల‌మందికి పైగా విద్యార్థుల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడ‌టం ఫ్యాక్షన్‌ సీఎంకి త‌గ‌దని లోకేశ్‌ ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details