రెండేళ్లలో పరిశ్రమల్ని బెదిరించి వసూలు చేసిన రూ.30వేల కోట్ల జె టాక్స్(jagan tax) ను రాష్ట్రానికి తెచ్చిన పెట్టుబడులుగా మంత్రి గౌతమ్ రెడ్డి(minister gowtham reddy ) చెప్పుకుంటున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(lokesh) దుయ్యబట్టారు. 65 భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయని చెప్పిన మంత్రి.., ప్రెసిడెంట్ మెడల్ విస్కీ, ఆంధ్రా స్టార్ బ్రాందీ కంపెనీలు తప్పించి కొత్తగా వచ్చినవేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
తెదేపా ఐదేళ్ల పాలనలో విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే 3,4వ స్థానాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జగన్‌రెడ్డి రెండేళ్ల పాలనలో 13వ స్థానానికి పడిపోయిందని విమర్శించారు. చంద్రబాబు (chandrababu) తీసుకొచ్చిన కియా(KIA) యాజమాన్యాన్ని వైకాపా ఎంపీలే వీధిరౌడీల కంటే ఘోరంగా బెదిరించడం చూశాక ఏ విదేశీ కంపెనీ ఏపీ కి వస్తుందని ప్రశ్నించారు. జె ట్యాక్స్ చెల్లించని కంపెనీలపై పీసీబీ (appcb)ని ప్రయోగించి మూయించేస్తుంటే, ఇంకెవరు కొత్తగా పెట్టుబడి పెడతారని లోకేశ్ నిలదీశారు.