ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జగన్ పరిపాలనలో.. పబ్లిసిటీ పీక్, మ్యాటర్ వీక్: లోకేశ్ - ఏపీ సీఎం తాజా వార్తలు

జగన్ పరిపాలన చూస్తే పబ్లిసిటీలో పీక్... మ్యాటర్​లో మాత్రం వీక్ అని నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు రకరకాల హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చాక పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణాల్లో అభివృద్ధి అనేది లేకుండా చేశారని ఆరోపించారు. 21 నెలల వైకాపా పాలనలో దాడులు, బెదిరింపులు, కబ్జాలు తప్ప... ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వైకాపాకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

lokesh
lokesh

By

Published : Feb 26, 2021, 4:06 PM IST

Updated : Feb 26, 2021, 4:38 PM IST

సీఎం జగన్ పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒక్క ఛాన్స్ అని రాష్ట్రానే నాశనం చేశారని విమర్శించారు. 21 నెలల్లో ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదని మండిపడ్డారు. పింఛన్‌ డబ్బులు కేవలం 250 రూపాయలు మాత్రమే పెంచి మోసం చేశారన్నారు. అమ్మఒడి అర్ధ ఒడి చేశారని ఆరోపించారు. మునిగిపోయే భూములను ఇళ్ల పట్టాలుగా ఇచ్చారని మండిపడ్డారు. కేసుల మాఫీ కోసం సీఎం జగన్​ రాష్ట్ర ప్రయోజనాలన్నీ తాకట్టుపెట్టారన్నారు.

నారా లోకేశ్

'జగన్ రెడ్డి పరిపాలన చూస్తే ఒకటి అర్థం అవుతోంది. పబ్లిసిటీలో పీక్.. మ్యాటర్ మాత్రం వీక్. ఇందుకు సన్న బియ్యమే మంచి ఉదాహరణ. ఎన్నికలకు ముందు సన్నబియ్యం అని చెప్పి.. తరువాత నాణ్యమైన బియ్యమన్నారు. వేలాది కోట్ల రూపాయలు పెట్టి వాహనాలను ఏర్పాటు చేశారు. బెంజ్ సర్కిల్ దగ్గర ప్రదర్శన పెట్టారు. స్పీడ్ గా గ్రామాలకు పంపించారు. ఊళ్లల్లో ప్రజలు మాత్రం ఛీ కొట్టారు. అంతే స్పీడ్​తో వాహనాలు తాడేపల్లి ప్యాలెస్​కు వచ్చాయి'- నారా లోకేశ్

పట్టణాలు, నగరాల్లోని అభివృద్ధిని వైకాపా ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలిపోయిన ఎల్ఈడీ బల్బులను కూడా మార్చలేని పరిస్థితిలో ఉందన్నారు. జ'గన్' అని చెబితే ప్రజలందరూ నమ్మారు...కానీ అది బుల్లెట్ లేని గన్ అనే విషయాన్ని మరిచిపోయారని వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయన్న లోకేశ్... నరసరావుపేటలో అనూష అనే విద్యార్థిని దారుణంగా హత్య చేశారని గుర్తు చేశారు. దిశ చట్టంతో ప్రభుత్వం ఏం సాధించిందని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న విశాఖను.. భూకబ్జాలకు కేరాఫ్ గా మార్చారని ఆరోపించారు. గత 21 నెలల వైకాపా పాలనలో కరెంట్ ఛార్జీలను విపరీతంగా పెంచారని దుయ్యబట్టారు. బస్సు ఛార్జీలతో పాటు ఇంటి పన్నులు విపరీతంగా పెంచారన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోన్న వైకాపా ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి

పాత నోటిఫికేషన్​ ప్రకారమే ఎన్నికలు: హైకోర్టు

Last Updated : Feb 26, 2021, 4:38 PM IST

ABOUT THE AUTHOR

...view details