జగన్ ధన దాహానికి ప్రజలు బలైపోతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ప్రకాశంలో 20 మంది, కడపలో ముగ్గురు... నాటు సారా, శానిటైజర్ తాగి మృతి చెందటం బాధాకరమన్నారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. జే ట్యాక్స్ వసూళ్ల కోసమే నూతన మద్యం పాలసీ తీసుకొచ్చారని దుయ్యబట్టారు. నాసిరకం బ్రాండ్లతో ప్రజల రక్తాన్ని తాగుతూ 25 వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆక్షేపించారు. ఇప్పటికైనా సీఎం మద్యం నిషేధం పేరుతో దందా చేయడం మాని... ప్రజల ప్రాణాలను కాపాడాలని హితవు పలికారు.
జగన్ ధన దాహానికి ప్రజలు బలైపోతున్నారు: లోకేశ్ - liquor policy in ap
వైకాపా ప్రభుత్వంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాటుసారా, శానిటైజర్లు తాగి 20 మంది మృతి చెందటం బాధాకరమన్న ఆయన... ఇవ్వన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు.
nara lokesh
Last Updated : Aug 3, 2020, 3:15 PM IST