గన్ కంటే ముందు జగన్ వస్తాడని ప్రచారాలు చేశారని.., వాస్తవంలో గన్ను, జగను రావడం లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. 3 రోజుల్లో మూడు దారుణాలు జరిగాయని దుయ్యబట్టారు. మొన్న రమ్య ,నిన్న బాలికపై మానవ మృగం దాడి, ఇవాళ యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించడం వంటి ఘోరాలు జరుగుతున్నా జగన్ రెడ్డిలో.. చలనం లేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించేందుకు.. మనసు రావడం లేదా..? అని ప్రశ్నించారు. ఇక 16 రోజులే మిగిలాయని, రమ్యని అంతం చేసిన నిందితుడికి శిక్ష ఎప్పుడు విధిస్తారని లోకేశ్ నిలదీశారు.
Nara Lokesh: ఇక 16 రోజులే మిగిలాయి.. నిందితుడికి శిక్ష ఎప్పుడు..? - జగన్ పై లోకేశ్ ఫైర్
సీఎం జగన్ పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వరుసగా ఘోరాలు జరుగుతున్నా.. జగన్ రెడ్డిలో చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రమ్యను అంతం చేసిన నిందితుడికి శిక్ష ఎప్పుడు విధిస్తారని ట్విటర్ వేదికగా నిలదీశారు.
nara lokesh fiers on cm jagan