ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైకాపా నేతల ఒత్తిడితోనే ప్రియాంక ఆత్మహత్యాయత్నం - సీఎం జగన్ పై లోకేశ్ ఫైర్

వైకాపా పాలనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది పోలీసు అధికారుల నిర్లక్ష్యం, వైకాపా నేతల ఒత్తిడితో పూజారి ప్రియాంక అనే యువతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుందంటూ ట్వీట్ చేశారు.

nara lokesh
nara lokesh

By

Published : Dec 27, 2020, 9:46 PM IST

జగన్ పాలనలో మరో గిరిజన యువతి బలైపోయిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. వైకాపా నాయకుల ఒత్తిడి, కొంతమంది పోలీసు అధికారుల నిర్లక్ష్యం కారణంగా బంగారు భవిష్యత్తు ఉన్న పూజారి ప్రియాంక చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రేమ పేరుతో మోసపోయిందని, ఫిర్యాదు చేయడానికి వెళ్లిన తండ్రికి అవమానం ఎదురవ్వడంతో ఆత్మహత్యకు యత్నించిందని ఆరోపించారు.

ప్రియాంకని మోసం చేసిన వ్యక్తి తండ్రి వైకాపా ఎమ్మెల్యే అనుచరుడు కావడంతో ఆమెకి ఈ పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రియాంకకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఈ దుస్థితి తెచ్చిన వైకాపా నాయకులు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన ట్విటర్ వేదికగా డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details