కన్న తల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్టుగా.. జగన్ రెడ్డి అమ్మఒడి పథకం తీరు ఉందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. తేదీల మతలబుతో ఒక ఏడాది ఎగ్గొట్టడం, మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో 1000 రూపాయలు కోత పెట్టడం వంటి చర్యలతో.. అమ్మ ఒడిని కాస్తా అర్ధఒడిగా మార్చారని ఎద్దేవా చేశారు. తాజాగా ఈ పథకంపై ఆంక్షల కత్తి ఎక్కుపెట్టి దాని మనుగడనే ప్రశ్నార్ధకంగా మార్చేశారని దుయ్యబట్టారు.
అమ్మఒడిపై ఆంక్షలు.. మనుగడే ప్రశ్నార్థకం : నారా లోకేశ్ - Nara Lokesh criticizes
అమ్మఒడి పథకంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. తేదీల మతలబుతో ఒక ఏడాది ఎగ్గొట్టడం, మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో వెయ్యి రూపాయలు కోత పెట్టి ఆ పథకం మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చారని ఎద్దేవా చేశారు.
300 యూనిట్లు దాటి కరెంట్ వాడితే అమ్మఒడి కట్, ప్రతి విద్యార్థికీ 75 శాతం హాజరు తప్పనిసరి, ఆధార్‍లో కొత్త జిల్లాలను నమోదు చేసుకోవాలి, కొత్త బియ్యం కార్డు ఉంటేనే అమ్మఒడి వంటి నిబంధనలు వర్తిస్తాయని ముందే ఎందుకు చెప్పలేదు జగన్ రెడ్డి అని నిలదీశారు. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే 30 వేలు వేస్తామని జగన్ సతీమణి ఇచ్చిన హామీని కూడా గంగలో కలిపేశారని మండిపడ్డారు. మాతృమూర్తులను మానసిక క్షోభకు గురిచేసే ఈ ఆంక్షలు రద్దు చేసి అర్హులందరికీ అమ్మ ఒడి ఇవ్వాలని లోకేశ్ డిమాండ్ చేశారు. అనంతరం అమ్మ ఒడిపై వైఎస్ భారతికి సంబంధించిన ఓ వీడియోను లోకేశ్ విడుదల చేశారు.
ఇదీ చదవండి:రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నిరసనలు.. ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్