కరోనా పెద్ద విషయం కాదంటూ చెప్పిన జగన్.... ఆరున్నర లక్షల మంది కొవిడ్ బారిన పడటానికి కారణమయ్యారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. బ్లీచింగ్ చల్లితే చచ్చిపోతుంది, పారాసిట్మాల్ వేసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పి 5వేల 506 మంది చావుకి కారణమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడటం లేదన్నారు.
క్వారంటైన్ కేంద్రాలు వ్యాధి తగ్గించడానికా లేక చంపడానికా?: నారా లోకేశ్ - వైకాపా ప్రభుత్వంపై నారా లోకేశ్ విమర్శలు
కొవిడ్ విషయంలో వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే 5వేల మందికిపైగా చనిపోయారని ట్విట్టర్ వేదికగా నారా లోకేశ్ మండిపడ్డారు. కళ్యాణదుర్గం క్వారంటైన్ కేంద్రంలో కొవిడ్ బాధితులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
తమని జంతువుల కంటే హీనంగా చూస్తున్నారని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం క్వారంటైన్ కేంద్రంలో కరోనా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని... వారికి కనీస సౌకర్యాలు కూడా లేవని ఎద్దేవా చేశారు. తినడానికి తిండి పెట్టడం లేదన్నారు. క్వారంటైన్ కేంద్రాలు వ్యాధి తగ్గించడానికా లేక ప్రజల్ని చంపడానికా అని నిలదీశారు.