రాజధాని అనేది రాష్ట్రానికి మధ్యలో ఉండాలని గతంలో చెప్పిన జగన్మోహన్ రెడ్డి.. నేడు ఎందుకు జే- టర్న్ తీసుకున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ప్రశ్నించారు. రాజధానికి ఎక్కడినుంచి ప్రయాణం చేయాలన్న ఇబ్బంది ఉండకూడదని, నీటి వనరులు అందుబాటులో ఉండాలని చెప్పిన మాటల నుంచి ఎందుకు టర్న్ తీసుకున్నారన్నారు. మాట మార్చడం వెనుక రహస్యం ఏమిటని నిలదీశారు.
సీఎం జగన్ మాట మార్చడం వెనుక రహస్యం ఏమిటి: లోకేశ్ - సీఎం జగన్పై లోకేశ్ విమర్శల వార్తలు
రాజధాని అమరావతిపై సీఎం జగన్ మాట మార్చడం వెనుక రహస్యం ఏమిటని నారా లోకేశ్ ప్రశ్నించారు. గతంలో చెప్పిన మాటల నుంచి ఎందుకు జే-టర్న్ తీసుకున్నారని నిలదీశారు.
నారా లోకేశ్