ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం జగన్​కు జైలు భయం పట్టుకుంది: నారా లోకేశ్ - ఐటీ దాడుల విషయంలో వైకాపా ప్రభుత్వంపై లోకేశ్ ఆగ్రహం

సీఎం జగన్​కు జైలు భయం పట్టుకుందని.. అందుకే తెదేపాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. ఐటీ దాడులను తెదేపాకు ముడిపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.

nara lokesh counter attack on ycp on it raids issue
వైకాపా ప్రభుత్వంపై నారా లోకేశ్ విమర్శలు

By

Published : Feb 14, 2020, 1:30 PM IST

ముఖ్యమంత్రి జగన్​పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్​లో విమర్శలు గుప్పించారు. అవినీతిపరుడైన జగన్‌కు లోకమంతా అవినీతి కనపడటంలో ఆశ్చర్యం లేదన్నారు. దేశంలో 40 చోట్ల ఐటీ సోదాలు నిర్వహిస్తే రూ.85 లక్షలు దొరికాయని.. చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో రూ.2 వేల కోట్లు దొరికాయని వైకాపా ఎలా చెబుతుందని నిలదీశారు. తప్పుడు ప్రచారాలు చేస్తూ అదేదో గొప్ప పని అనుకుంటున్నారని మండిపడ్డారు. జగన్‌కు జైలు భయం పట్టుకుందని.. అందుకే ఐటీ దాడులను తెదేపాకు ముడిపెట్టాలని తాపత్రయపడుతున్నారని ధ్వజమెత్తారు. 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి తనలాగే అందరూ జైలుకు వెళ్లాలని కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

వైకాపా ప్రభుత్వంపై నారా లోకేశ్ విమర్శలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details