బోటు ప్రమాదం వెనక రహస్యాలను దాచలేరు: లోకేశ్ - cops registerd case on ex mp harsha kumar
గోదావరి బోటు ప్రమాదంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నారా లోకేశ్ తప్పుబట్టారు. ప్రమాదం వెనక ఉన్న రహస్యాలను జల సమాధి చేయాలని చూస్తున్నారని విమర్శించారు. మాజీ ఎంపీ హర్షకుమార్ని కేసుల పేరుతో వేధించటం సరికాదని అన్నారు.
గోదావరి బోటు ప్రమాదం వెనక ఉన్న నిజాలు బయటపెట్టిన మాజీ ఎంపీ, దళిత నాయకుడు హర్ష కుమార్ను కేసుల పేరుతో వేధిస్తారా అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిలదీశారు. గోదావరిలో 144 సెక్షన్ పెట్టిన మేధావి జగన్ అని ఎద్దేవా చేశారు. నదిలో నుంచి బోటును తీయకపోవటం ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనంఅనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలని ప్రశ్నించారు. బోటు ప్రమాదం వెనక ఉన్న రహస్యాన్ని జల సమాధి చేయాలని చూస్తే నిజాలు దాగవని హెచ్చరించారు. ఘటనపై సమగ్రమైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు.