పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్‌రెడ్డి ఆకస్మిక మరణం పట్ల తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం ఎంతో కలచివేసిందని అన్నారు.
శ్రీకాంత్‌రెడ్డి... చిత్తశుద్ధి, నిజాయితీ ఉన్న వ్యక్తి అని కొనియాడారు. ఎంతో స్నేహంగా ఉండే వ్యక్తి మరణాన్ని తాను జీర్ణించుకోలేక పోతున్నానని చెప్పారు. వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.