ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రతిపక్ష నేత హక్కులను హరిస్తున్నారు' - lokes fires on ysrcp govrnment

వైకాపా ప్రభుత్వం ప్రతిపక్ష నేత హక్కులను హరిస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేణిగుంట విమానాశ్రయంలో పార్టీ అధినేత చంద్రబాబును అడ్డుకోవటాన్ని తప్పబట్టారు.

Nara lokesh  fires on ysrcp government
Nara lokesh fires on ysrcp government

By

Published : Mar 1, 2021, 1:15 PM IST

రేణిగుంట విమానాశ్రయంలో తెదేపా అధినేత చంద్రబాబును అడ్డుకోవటాన్ని.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తీవ్రంగా ఖండించారు. 2019లో పల్నాడు వెళ్లకుండా ఇంటి గేటుకి తాళ్లు కట్టి అడ్డుపడ్డారని, 2020లో విశాఖ విమానాశ్రయం నుంచి బయటకు రాకుండా చుట్టుముట్టారని, 2021లో రేణిగుంట విమానాశ్రయంలో నిర్బంధించారని ధ్వజమెత్తారు.

పిరికి పాలకుడు జగన్ అరాచకాలు ఇంకెన్నాళ్లని లోకేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. జగనోక్రసీతో డెమొక్రసీని అపహాస్యం చేస్తూ.... ప్రతిపక్ష నేత హక్కులను హరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఒక్కో ఘటన జగన్ పతనానికి నాంది కాబోతోందని లోకేశ్ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details