ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అర్హులైన ప్రతి ఒక్కరికి నేతన్న నేస్తం వర్తింపజేయాలి: లోకేశ్ - ysr nethanna nestham scheme weavers

అర్హులైన ప్రతి ఒక్కరికీ నేతన్న నేస్తం పథకాన్ని వర్తింపజేయాలని తెదేపా నేత నారా లోకేశ్ డిమాండ్ చేశారు. కేవలం పది శాతం మందికే పథకం అందిందని విమర్శించారు. ఆత్మహత్యలకు పాల్పడిన నేతన్నల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

nara lokesh
nara lokesh

By

Published : Sep 9, 2020, 10:18 PM IST

చేనేత కార్మికులను ఆదుకోలేని ప్రభుత్వం ఎందుకని తెదేపా జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. నేత‌న్న నేస్తమంటూనే రిక్తహ‌స్తం చూపారని మండిపడ్డారు. చేనేత ప్రతినిధుల‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిచిన అయన ఒక్కో చేనేత కుటుంబానికి 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేనేత‌ల‌లో 10 శాతం మందికే ఇచ్చిన నేత‌న్న నేస్తం ప‌థ‌కాన్ని అంద‌రికీ వ‌ర్తింప‌జేయాలన్నారు. ప‌థ‌కం అంద‌ని అర్హుల జాబితా త‌యారు చేసి న్యాయం కోసం వారి తరఫున పోరాడ‌తామని స్పష్టం చేశారు.

ప్రతి మూడు నెల‌ల‌కొసారి రాష్ట్ర వ్యాప్తంగా చేనేతల‌ స‌మ‌స్యలు తెలుసుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని లోకేశ్ తెలిపారు. గ‌త 15 నెల‌ల్లో ఆత్మహ‌త్యల‌కు పాల్పడిన‌ 50 మంది చేనేత కార్మికుల కుటుంబాల‌ను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులు నానా ఇబ్బందులు ప‌డుతుంటే ముఖ్యమంత్రి క‌నీసం ప‌ట్టించుకోవాల‌నే ఆలోచ‌న‌లో కూడా లేక‌పోవ‌డం విచార‌క‌రమన్నారు.

ABOUT THE AUTHOR

...view details