ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'నాటి ప్రాజెక్టులకే పేర్లు మార్చి అనుమతులు ఇవ్వటమేంటి?' - కృష్ణా గోదావరి అనుసంధానం వార్తలు

నదుల అనుసంధానాన్ని నిజం చేసి చూపిన వ్యక్తి తెదేపా అధినేత చంద్రబాబు అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కొనియాడారు. నాడు తెదేపా హయాంలో చేపట్టిన గోదావరి - పెన్నా అనుసంధానంపై విమర్శలు చేసిన వైకాపా నేతలు.. ఇవాళ పేర్లు మార్చి ప్రాజెక్టు పనులకు ఎలా అనుమతులు ఇస్తున్నారని ప్రశ్నించారు.

nara lokesh
nara lokesh

By

Published : Apr 23, 2020, 5:06 PM IST

నారా లోకేశ్ ట్వీట్

దేశంలోనే కలగా మిగిలిపోయిన, నదుల అనుసంధానాన్ని తెదేపా అధినేత చంద్రబాబు నిజం చేసి చూపించారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ గుర్తు చేశారు. పట్టిసీమ ద్వారా గోదావరి - కృష్ణా నదులను కలిపారని అన్నారు. అదే స్ఫూర్తితో గోదావరి, పెన్నా నదులను అనుసంధానం చేసి, సాగర్ ఆయకట్టుకి నీరు ఇవ్వాలని తలచారని చెప్పారు. అందులో భాగంగానే గోదావరి - పెన్నా అనుసంధానం తొలి దశ పనులు కూడా మొదలు పెట్టారని పేర్కొన్నారు.

2017లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేశారని... 2018లో మొదటి దశ పనులు కూడా ప్రారంభించారని గుర్తు చేశారు. ఆ రోజు ఇదో పెద్ద స్కాం అని వైకాపా నేతలు మాట్లాడిన తీరుని వివరించారు. ఈ రోజు అదే ప్రాజెక్టు పేరు మార్చి.. వైఎస్​ఆర్ పల్నాడు కరువు నివారణ పథకంగా రూ.6020 కోట్లతో అనుమతలు ఇవ్వటాన్ని ఏమంటారని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details