సీఎం జగన్‌పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఫైర్ అయ్యారు. తన బ్లూ మీడియాలో వైఎస్సాసుర చరిత్ర గురించి ఎప్పుడు రాయిస్తారని..? నిలదీశారు. వైఎస్ జగన్‌రెడ్డి బంధువు, కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి అన్నీ తానై వ్యవహరించే వైకాపా రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకోవడంతో మరిన్ని అనుమానాలు బలపడుతున్నాయన్నారు. దస్తగిరి వాంగ్మూలం ప్రకారం గొడ్డలిపోటు సూత్రధారి వైఎస్ అవినాశ్‌రెడ్డేనని లోకేశ్ ఆరోపించారు. అవినాశ్‌రెడ్డిని ఈ కేసునుంచి తప్పించేందుకు సిట్ బృందాన్ని మార్చేసి, సీబీఐ విచారణ వద్దన్నది వైఎస్ జగన్‌రెడ్డేనని గుర్తు చేశారు.
Lokesh on viveka case: వైఎస్సాసుర రక్త చరిత్ర గురించి ఎప్పుడు రాయిస్తారు: లోకేశ్ - వివేకా కేసులో అవినాశ్ రెడ్డి
వివేకా హత్య కేసులో వైకాపా రాష్ట్ర కార్యదర్శి శివశంకర్‌రెడ్డి పాత్రపై అనుమానాలున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఆయన్ను సీబీఐ అదుపులోకి తీసుకోవడమే ఇందుకు కారణమన్నారు. దస్తగిరి వాంగ్మూలం మేరకు గొడ్డలిపోటు సూత్రధారి.. అవినాశ్‌రెడ్డే అని ట్వీట్ చేశారు.
nara lokesh comments on mp avinash reddy