గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో పేదల ఇళ్లను కూల్చడాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మానవత్వం లేకుండా రోజుకో చోట పేదల గూడు కూల్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పాపం ఎమ్మెల్యేను ఊరికే వదలదని దుయ్యబట్టారు.
సమస్య కోర్టు పరిధిలో ఉన్నా ఎమ్మెల్యే ఒత్తిడితో అధికారులు, పోలీసులు ప్రజలను నడి రోడ్డు మీదకి నెట్టేశారని లోకేశ్ ఆరోపించారు. రెండేళ్లలో పేదలకు ఒక్క ఇల్లు కట్టని వైకాపా ప్రభుత్వానికి.. వారు కష్టపడి కట్టుకున్న ఇంటిని కూల్చే చేసే హక్కు ఎవరిచ్చారని నిలదీశారు. పేదలకు న్యాయం జరిగే వరకూ బాధితుల పక్షాన తెదేపా పోరాడుతుందన్నారు.