సీఎం జగన్‌ని చూసి రాష్ట్రానికి రావాల్సిన సంస్థలు బైబై ఏపీ అంటున్నాయని... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆక్షేపించారు. చేసేదేమీ లేక చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి వచ్చిన సంస్థలు తామే తెచ్చామని జగన్ బిల్డప్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. శ్మశానాలకు పార్టీ రంగులు వేసుకునే జగన్‌కు... ఇంతకంటే మంచి ఆలోచనలు వస్తాయనుకోవడం అత్యాశే అవుతుందని పేర్కొన్నారు.
'జగన్‌ని చూసి సంస్థలన్నీ... బైబై ఏపీ అంటున్నాయి' - వైకాపా ప్రభుత్వంపై లోకేష్ కామెంట్ వార్తలు
ముఖ్యమంత్రి జగన్పై ట్విట్టర్ వేదికగా నారా లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్‌ని చూసి రాష్ట్రానికి రావాల్సిన కంపెనీలు బైబై ఏపీ అంటున్నాయని ట్వీట్ చేశారు.
!['జగన్‌ని చూసి సంస్థలన్నీ... బైబై ఏపీ అంటున్నాయి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5145760-418-5145760-1574423903336.jpg)
nara-lokesh-comments-on-cm-ys-jagan
వీర వాహన సంస్థను రాష్ట్రానికి తీసుకురావడానికి చంద్రబాబు పడిన కష్టం అందరికీ తెలుసని లోకేశ్ గుర్తుచేశారు. రాయితీలు ఇచ్చి, భూ కేటాయింపులు చేసి తెచ్చిన కంపెనీకి... వైకాపా రంగు పూయాలని జగన్ తాపత్రయపడుతున్నారని ధ్వజమెత్తారు. సొంతంగా ఏదైనా సాధించి డప్పు కొట్టుకోవాలని హితవు పలికారు.
ఇదీ చదవండి : 'ఆంగ్రమాధ్యమంపై చంద్రబాబు యూటర్న్'