ప్రభుత్వం తనపై ఎన్ని కేసులు పెడుతుందో పెట్టుకోమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. కష్టాల్లో ఉన్నోళ్ల కన్నీరు తుడిచేందుకు ప్రతీ ఊరూ వెళ్లి ప్రతి గడపా తొక్కి బాధితులకు భరోసానిస్తానని తేల్చి చెప్పారు. రైతుల్ని పరామర్శించడం, వారికి అండగా పోరాటం చేసి న్యాయం చెయ్యమని డిమాండ్ చెయ్యడం జగన్ రెడ్డి దృష్టిలో నేరమని ఆయన మండిపడ్డారు. ఈ నేరంపై కేసు పెట్టే సెక్షన్లు ఆయన పోలీసుల వద్ద లేకే.... కొవిడ్ నిబంధనలు ఉల్లంఘన, ట్రాక్టర్ నడిపారంటూ తనపై కేసులు బనాయించారని విమర్శించారు. వరద బాధితులను పరామర్శించేందుకు గడప దాటని జగన్ రెడ్డి.... గడప గడపకీ వెళ్లే తనను అడుగడుగునా అడ్డుకోవాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరద బాధితులను పరామర్శించడానికి వెళ్తే కేసులు పెట్టడమేంటీ?: లోకేశ్
వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన తనపై ప్రభుత్వం అకారణంగా కేసులు నమోదు చేస్తోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మండిపడ్డారు.
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్