Nara Lokesh: గన్ కంటే ముందొస్తానని కోట్ల రూపాయలతో ప్రకటనలు ఇచ్చిన జగన్.. సొంత కడప జిల్లా ప్రొద్దుటూరులో అన్నెం పున్నెం ఎరుగని దళిత బాలికపై సామూహిక అత్యాచారం జరిగితే.. ఏదా గన్.. ఎక్కడా జగన్ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిలదీశారు. అమాయక బాలికపై లైంగిక దాడిని మహిళా పోలీసులు వెలుగులోకి తెస్తే... పోలీసులు నిందితుల్ని పట్టుకోకుండా కేసు మాఫీ చేయాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 15ఏళ్లు కూడా నిండని బాలికని గర్భవతిని చేసిన 'నిందితులను కాపాడటమేనా మీరు ఆడబిడ్డలకు కల్పించే రక్షణ' అంటూ లోకేశ్ ధ్వజమెత్తారు.
'గన్ కంటే ముందొస్తానని ప్రకటనలు ఇచ్చిన జగన్... ఇప్పుడు ఎక్కడ..?' - కడపలో బాలికపై అత్యాచారం ఘటనలో జగన్పై లోకేశ్ ఆగ్రహం
Nara Lokesh: గన్ కంటే ముందొస్తానని కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చి.. సొంత జిల్లాలో బాలికపై అత్యాచారం జరిగితే జగన్ ఎక్కడ అని నారా లోకేశ్ ప్రశ్నించారు. గర్భవతిని చేసిన నిందితులను కాపాడటమేనా.. ఆడబిడ్డలకు కల్పించే రక్షణ..? అని ట్విట్టర్ వేదికగా నిలదీశారు.
నారా లోకేశ్