ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రోజుకో అమానుష ఘటన జరుగుతున్నా.. ప్రభుత్వ తీరులో మార్పు లేదు'

Nara Lokesh: రాష్ట్రంలో రోజుకో అమానుష ఘటన జరుగుతున్నా ప్రభుత్వ తీరులో మార్పు లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా సంగంలో బాలుడి మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్​ సిబ్బంది నిరాకరించిన మరో అమానవీయ ఘటన చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Nara Lokesh
నారా లోకేశ్‌

By

Published : May 5, 2022, 10:24 AM IST

Nara Lokesh: నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్​మార్టం కోసం సిబ్బంది రూ.15 వేలు డిమాండ్ చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా సంగంలో మరో అమానవీయ ఘటన చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. బిడ్డని కోల్పోయిన బాధలో ఉన్న తండ్రి అంబులెన్స్ ఏర్పాటు చేయాలని వేడుకున్నా.. ఆస్పత్రి సిబ్బంది మానవత్వంతో స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. ఎవరూ సహాయం చేయని దయనీయ పరిస్థితిలో ఆ తండ్రి బైక్​పైనే కొడుకు శ్రీరామ్ మృతదేహాన్ని తరలించారన్నారు. పబ్లిసిటీ పిచ్చితో జెండా ఊపిన వాహనాలన్నీ ఎక్కడికి పోయాయని జగన్‌రెడ్డిని ప్రశ్నించారు. సిబ్బంది, కనీస సౌకర్యాల లేమితో ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ఘోరమైన పరిస్థితులు నెలకొన్నాయని దుయ్యబట్టారు.

Nara Lokesh: అంబులెన్స్ నిర్వహణ... ఏ2 సాయిరెడ్డి అల్లుడికి కట్టబెట్టాకే ఈ దారుణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ అమానవీయ ఘటనలపై ఒక్కసారైనా సమీక్ష చేశారా అని నిలదీశారు. రుయాలో అంబులెన్స్ మాఫియా అరాచకం చూశామని, విశాఖ కేజీహెచ్‌ ప్రసూతి విభాగంలో ఒక కుటుంబంపై తల్లీబిడ్డ ఎక్స్​ప్రెస్ వాహనాల మాఫియా దాడి చూసి షాక్ అయ్యామన్నారు. రాష్ట్రంలో రోజుకో అమానుష ఘటన జరుగుతున్నా ప్రభుత్వ తీరులో మార్పు లేదని లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:అమానుషం.. 108 వాహనం రాక... బైక్​ పైనే..

ABOUT THE AUTHOR

...view details