రాష్ట్రం కోసం భూమిని త్యాగం చేసిన రైతుల్ని 'బులుగు' యూనిఫామ్ వేసుకున్న కొందరు అసభ్యంగా బూతులు తిట్టారని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. అమరావతి ఆందోళనలో రైతుల్ని అరెస్టు చేస్తూ కొందరు పోలీసులు వారిని దూషించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాకు జత చేశారు. రేపోమాపో జైలుకి పోయే జగన్‌రెడ్డిని చూసుకొని కొంతమంది పోలీసులు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. తిట్టిన ప్రతి తిట్టు, కొట్టిన ప్రతి దెబ్బ, పెట్టిన ప్రతి కేసు గుర్తుంటాయని, రైతుల్ని అవమానించిన ప్రతి ఒక్కరు వాళ్ల కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పేలా చేస్తామని హెచ్చరించారు.
పోలీసులూ.. అన్నీ గుర్తుంటాయి జాగ్రత్త: నారా లోకేశ్ - Nara Lokesh comments on Jagan
రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులపై తీరుపై నారా లోకేశ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమం చేస్తున్న రైతుల్ని పోలీసులు దూషించిన వీడియోను ఆయన ట్విట్టర్ ఖాతలో పోస్టు చేశారు. కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల్ని అవమానించిన ప్రతి ఒక్కరూ వాళ్ల కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పేలా చేస్తామని హెచ్చరించారు.
నారా లోకేశ్