'అప్పుడు విదేశీ విద్య.. ఇప్పుడు స్వదేశీ శిరోముండనం' - lokesh latest tweets
చంద్రబాబు పాలనలో దళితులకు విదేశీ విద్య అందితే... జగన్ రెడ్డి పాలనలో దళితులకు స్వదేశీ శిరోముండనం దక్కిందని నారా లోకేశ్ ధ్వజమెత్తారు. దళితులపై వైకాపా దమనకాండకు నిరసనగా తెదేపా తలపెట్టిన శంఖారావం వీడియోను లోకేశ్ ట్విట్టర్లో విడుదల చేశారు.
దళితులపై జగన్ రెడ్డి దమనకాండకి అంతే లేదా అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిలదీశారు. వైకాపా పాలన దళితులపై వారానికో దాడి, నెలకో శిరోముండనం, మూడు నెలలకో హత్యగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో దళితులపై పిచ్చోళ్లనే ముద్ర, శిరోముండనం, కొట్టి చంపడం, నిప్పంటించడం ఎప్పుడైనా జరిగాయా అని లోకేశ్ ప్రశ్నించారు. దళితులను ఇంత ఘోరంగా అవమానించిన పాలకుడు జగన్ రెడ్డి ఒక్కడేనని తేల్చిచెప్పారు. చంద్రబాబు పాలనలో దళితులకు విదేశీ విద్య అందితే... జగన్ రెడ్డి పాలనలో దళితులకు స్వదేశీ శిరోముండనం దక్కిందని ధ్వజమెత్తారు. దళితులపై వైకాపా దమనకాండకు నిరసనగా తెదేపా తలపెట్టిన శంఖారావం వీడియోను లోకేశ్ ట్విట్టర్లో విడుదల చేశారు.