ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జేసీ ప్రభాకర్​రెడ్డి కుటుంబ సభ్యులకు లోకేశ్ పరామర్శ - నారా లోకేష్ తాజా వార్తలు

అనంతపురం జిల్లా తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పరామర్శించారు. జేసీ పవన్​తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కక్షపూరితంగా పెట్టే కేసులకు భయపడాల్సిన పని లేదని న్యాయం గెలుస్తుందని వారికి భరోసా ఇచ్చారు.

జేసీ ప్రభాకర్​రెడ్డి కుటుంబ సభ్యులకు నారా లోకేశ్ పరామర్శ
జేసీ ప్రభాకర్​రెడ్డి కుటుంబ సభ్యులకు నారా లోకేశ్ పరామర్శ

By

Published : Jun 15, 2020, 7:33 AM IST

Updated : Jun 15, 2020, 11:48 AM IST

తాడిపత్రిలోని జేసీ కుటుంబ సభ్యులను నారా లోకేశ్ పరామర్శించారు. మాజీ ఎంపీ జేసీ తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డితో లోకేశ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అన్ని విషయాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ కేసులో తమకు ఎటువంటి సంబంధం లేదని...అశోక్ లైలాండ్ , డీలర్లు తమకు తెలియకుండా బీస్-3 వాహనాలను విక్రయించినట్లు పవన్ వివరించారు. అనంతరం జేసీ దివాకర్ రెడ్డితోనూ భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు.

వాహనాల రిజిస్ట్రేషన్ల కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఉదయమే.. హైదరాబాద్ నుంచి బయల్దేరి అనంతపురం చేరుకున్నారు. అంతకుముందు కర్నూలు జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద తెలుగుదేశం నేతలు ఆయనకు స్వాగతం పలికారు. భౌతిక దూరం పాటిస్తూ పెద్దఎత్తున శ్రేణులు తరలి వచ్చారు. వాహనం దిగిన లోకేశ్​ వారందిరికి అభివాదం చేశారు.

జేసీ ప్రభాకర్​రెడ్డి కుటుంబ సభ్యులకు నారా లోకేశ్ పరామర్శ

బీఎస్ -3 వాహనాలను బీఎస్ -4 గా మారుస్తూ అక్రమాలకు పాల్పడ్డారన్న కేసులో 2 రోజుల క్రితం జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణ అనంతరం న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం కడప జైలుకు తరలించారు. వీరిని పరామర్శించేందుకు అధికారులను లోకేశ్ అనుమతి కోరగా... పోలీసులు నిరాకరించారు. దీంతో ఆయన ఇవాళ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను తాడిపత్రిలో పరామర్శించారు.

ఇవీ చూడండి-మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్​రెడ్డి అరెస్టు

Last Updated : Jun 15, 2020, 11:48 AM IST

ABOUT THE AUTHOR

...view details