"సీఎం జగన్ చేతకాని పాలనను వైకాపా ఎంపీలే ఎండగడుతున్నారు" అంటూ.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఓ వీడియోను ట్విట్టర్లో విడుదల చేశారు. అందులో వైకాపా ఎంపీలు రౌతు సూర్యప్రకాశ్, పిల్లి సుభాష్ చంద్రబోస్, మార్గాని భరత్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణలు కూర్చుని మాట్లాడుతున్న అంశాలపై లోకేశ్ స్పందించారు. కరోనా కట్టడికి ఏమీ చేయలేని పనికిమాలిన పాలన అని సొంత పార్టీ ఎంపీలే దుమ్మెత్తిపోశారని విమర్శించారు. ప్రజల ప్రాణాలు గాలికొదిలేశామని ఈ మూర్ఖపు ముఖ్యమంత్రికి చెబితే సొంత పార్టీ అని చూడకుండా కక్షసాధింపులకు దిగుతారని భయపడి.. బయట ఎవ్వరూ నోరు మెదపట్లేదన్నారు.
"వైకాపా ప్రజాప్రతినిధులు కలిసినప్పుడల్లా.. నీ మూర్ఖత్వాన్ని, నీ చేతగాని పాలనని, కరోనా కట్టడిలో నీ వైఫల్యాలను కుండబద్దలు కొడుతున్నారు. కరోనా నియంత్రణకి జగన్ ఏమి చేశాడంటూ.. పులివెందుల పిల్లి మెడలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తొలి గంట కట్టారు. ప్రభుత్వం లాజిస్టిక్స్ నిర్వహించడం లేదు, ముఖ్యమంత్రి చేతులెత్తేశాడని ఆగ్రహంగా ఉన్నారు. శవాల దహనం కూడా చందాలేసుకోవాల్సి వస్తోందని అధికారపార్టీ నేతలే వాపోతున్నారు. నేను మూర్ఖపురెడ్డి అంటే ఉలిక్కిపడి బూతులమంత్రిని బూతులతోనో, పేటీఎం బ్యాచ్‌లను ఫేక్ ట్వీట్లతోనో దింపుతావు. నిన్ను మీవాళ్లే నర్మగర్భంగా మూర్ఖపురెడ్డి అని అంటున్నారు" అని లోకేశ్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు.
ఇదీ చదవండి:బంగాల్లో కేంద్ర మంత్రి కాన్వాయ్‌పై దాడి