ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శివుని గుడిలో పాలు తాగుతున్న నంది! వీడియో వైరల్ - Adilabad shiva temple speciality

తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్​లో అద్భుత ఘటన చోటుచేసుకుంది. తిలక్ నగర్ శివాలయంలో ఉన్న నంది విగ్రహం పాలు తాగింది. విషయం తెలుసుకున్న స్థానికులు చేతిలో పాల గిన్నెలతో బారులు తీరారు.

nandi
nandi

By

Published : Mar 6, 2022, 5:01 PM IST

"అప్పుడప్పుడు వినాయకుడు కూడా పాలు తాగుతాడు.. అప్పుడే ఆయన కూడా ఉన్నాడని భక్తులు గుర్తుపెట్టుకుంటారు" అంటూ సూపర్​ స్టార్​ మహేశ్​బాబు ఓ సినిమాలో డైలాగ్ చెప్తాడు. ఆ లాజిక్​ ఎంత వరకు నిజమో కానీ.. అలాంటి ఆసక్తికర ఘటనే​ తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్​లోని తిలక్​నగర్​లో ఉన్న శివాలయంలో జరిగింది. ఆలయంలో ఉన్న నంది విగ్రహం పాలు తాగుతోంది.


నంది పాలు తాగడమేంటని ఆశ్చర్యపోతున్నారా..? నిజమేనండి బాబు.. భక్తులు తీసుకొచ్చిన లీటర్లకొద్ది పాలను నంది అలా పీల్చేస్తుంది. విషయం తెలుసుకున్న స్థానికులు చేతిలో పాల గిన్నెలతో బారులు తీరారు. నందీశునికి పాలు తాగించేందుకు పోటీ పడ్డారు. ఇదంతా దేవుని మహిమే అని నమ్మిన భక్తులు ఓం నమశివాయ అంటూ శివనామస్మరణ చేశారు.

ఆదిలాబాద్​లో అద్భుతం.. శివుని గుడిలో పాలు తాగుతున్న నంది..!

ఇదీ చూడండి:Great Poet Molla: కవయిత్రి మొల్ల సాహితీ సాంస్కృతిక మహోత్సవాలు

ABOUT THE AUTHOR

...view details