ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనాపై పోరులో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: బాలయ్య - నందమూరి బాలయ్య

కరోనాపై పోరులో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ మహమ్మారిపై పోరులో ప్రతీ ఒక్కరి భాగస్వామ్యం ఎంతో కీలకమన్నారు. త్వరలోనే వేక్సిన్​ అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

nandhamuri-balakrishna-hope-on-covid-vaccine-will-come-soon
మహేశ్వర వైద్య కళాశాల.. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో సినీ నటుడు బాలకృష్ణ

By

Published : Aug 26, 2020, 4:50 PM IST

మహేశ్వర వైద్య కళాశాల.. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో సినీ నటుడు బాలకృష్ణ

తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డిలోని మహేశ్వరం వైద్య కళాశాల.. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి వెయ్యి పీపీఈ కిట్లు, వెయ్యి ఎన్-95 మాస్క్​లను అందజేసింది. ఆసుపత్రి డైరెక్టర్, సినీ నటుడు బాలకృష్ణ వాటిని స్వీకరించారు. మహేశ్వరం వైద్య కళాశాల వైద్య సేవలే కాకుండా సామాజికంగా మంచి కార్యక్రమాలు చేస్తుండటం అభినందనీయమని బాలకృష్ణ ప్రశంసించారు.

కరోనా మహమ్మారిపై పోరులో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని బాలకృష్ణ కోరారు. ఈ పోరులో ప్రభుత్వాలు కూడా బాధ్యతగా పని చేయాలన్నారు. త్వరలోనే వ్యాక్సిన్​ అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్లాస్మా దానం చేసి వైరస్ సోకిన వారి ప్రాణాలను కాపాడాలని బాలయ్య విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details