ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Balakrishna on Childhood Cancer Day: 'అవసరమైన వారికి బసవతారకం ఆస్పత్రిలో ఉచిత చికిత్స'

Balakrishna on Childhood Cancer Day: తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని బసవతారకం ఆసుపత్రిలో చైల్డ్‌హుడ్ క్యాన్సర్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నందమూరి బాలకృష్ణ.. ఆసుపత్రిలో చిన్నపిల్లల డే కేర్ యూనిట్‌ను ప్రారంభించారు.

Balakrishna
Balakrishna

By

Published : Feb 15, 2022, 7:15 PM IST

'అవసరమైన వారికి బసవతారకం ఆస్పత్రిలో ఉచిత చికిత్స

Balakrishna on Childhood Cancer Day: అవసరమైన వారికి బసవతారకం ఆస్పత్రిలో ఉచిత చికిత్స అందిస్తామని ప్రముఖ సినీనటుడు, బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ అన్నారు. ఇంటర్నేషనల్ చైల్డ్ హుడ్ క్యాన్సర్ డేని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​లోని బసవతారకం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆసుపత్రిలో చిన్నపిల్లల డే కేర్ యూనిట్‌ను బాలకృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు సహా ఆసుపత్రి సిబ్బంది, క్యాన్సర్ బాధితుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

రోటరీ క్లబ్​తో కలిసి సర్వైకల్ క్యాన్సర్ నివారణలో భాగంగా 9 నుంచి 25 ఏళ్ల మధ్య ఉన్న బాలికలు, యువతులకు బసవతారకం ఆసుపత్రిలో హెచ్​పీవీ (HPV) టీకాలు పంపిణీ చేయనున్నట్టు బాలకృష్ణ తెలిపారు. బసవతారకం ఆసుపత్రిలో బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ ఉందని చెప్పిన ఆయన... ఆసుపత్రిలో జెనెటిక్ క్లినిక్‌లు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. జెనెటిక్ టెస్టింగ్ ద్వారా క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించవచ్చని బాలకృష్ణ సూచించారు. ఏటా ప్రపంచవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది చిన్నారులు క్యాన్సర్ బారిన పడుతున్నారన్న ఆయన... పిల్లల్లో క్యాన్సర్​ను గుర్తించటం తల్లిదండ్రుల బాధ్యతగా పేర్కొన్నారు.

బసవతారకం ఆస్పత్రిలో బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ ఉంది. ఆసుపత్రిలో జెనెటిక్ క్లినిక్‌లు ఉన్నాయి. అవసరమైన వారికి ఉచిత చికిత్స అందిస్తాం. జెనెటిక్ టెస్టింగ్ ద్వారా క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించవచ్చు. ఈ సంవత్సరం సర్వైవబుల్ అండ్ ఎచీవబుల్ అనే థీమ్​తో జరుపుకుంటున్నాం. చిన్న పిల్లల క్యాన్సర్​ ట్రీట్​మెంట్ విషయంలో మేం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాం. వారికి చికిత్స అందించడం వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. అందుకే చిన్నపిల్లల విభాగంపై ప్రత్యేక దృష్టి సారించాం.

-- నందమూరి బాలకృష్ణ, బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్

ఇదీ చదవండి:Actor Ali Meet CM YS Jagan: 'టికెట్ ఇచ్చినా వద్దని చెప్పా.. త్వరలోనే పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన'

ABOUT THE AUTHOR

...view details