ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'విభజన చట్టంలో పెండింగ్‌ అంశాలపై ప్రశ్నిస్తాం' - తెలంగాణ వార్తలు

ఏపీ పునర్విభజన చట్టంలో పరిష్కారం కాని అంశాలు చాలా ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ తెరాస నాయకులు అన్నారు. ఈ విషయమై పార్లమెంట్ సమావేశాల్లో తమ రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయపరమైన హక్కులపై గళమెత్తుతామని తెరాస లోక్‌సభ పక్షనేత నామా నాగేశ్వరరావు (NAMA NAGESWARA RAO) చెప్పారు. పెట్రోల్‌(petrol cost), డీజిల్‌(diesel cost) ధరలు తగ్గించే అంశాన్ని పరిశీలించాల్సిందిగా కోరామని వెల్లడించారు.

Nama Nageshwar
నామ నాగేశ్వర్

By

Published : Jul 19, 2021, 8:26 AM IST

నామ నాగేశ్వర్

సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్‌ సమావేశాల్లో దేశంలో నెలకొన్న సమస్యలపై చర్చకు సమయం ఇవ్వాలని కోరినట్లు తెరాస లోక్‌సభ పక్షనేత నాామా నాగేశ్వరరావు (NAMA NAGESWARA RAO) వెల్లడించారు. ఏపీ పునర్విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలతో పాటు ఆ రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయపరమైన హక్కులపైనా గళమెత్తుతామని స్పష్టం చేశారు. ఆ చట్టంలో పరిష్కారం కాని అంశాలు చాలా ఉన్నాయని తెలిపారు. ఈ విషయమై కేంద్రానికి ఇప్పటికే అనేక లేఖలు ఇచ్చామని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పెండింగ్‌ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

పెట్రోల్‌ (petrol costs), డీజిల్‌ ధరలు (diesel costs) తగ్గించే అంశాన్ని పరిశీలించాల్సిందిగా కోరామని నామా తెలిపారు. రాష్ట్ర హక్కులు, రావాల్సిన నిధుల గురించి సభలో ప్రస్తావిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రానికి నష్టం కలిగించే అంశాలపై తమ పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు.

'కరోనా, వ్యాక్సినేషన్‌ సమస్యలపై చర్చ జరగాలని కోరాం. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై చర్చించాలని విజ్ఞప్తి చేశాం. కేవలం బిల్లులే కాకుండా 40 శాతం సమయాన్ని దేశ సమస్యలపై మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని కోరాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలపై చర్చించాల్సిన అవసరం ఉంది. తెరాస ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా రైతుబంధు (rythu bandhu), మిషన్ భగీరథ(mission bhagiratha), పల్లె ప్రగతి(palle pragathi), పట్టణ ప్రగతి(pattana pragathi) వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాం. రాష్ట్రంలో ఏడేళ్ల నుంచి జరుగుతున్న అభివృద్ధిని ఆపాలని చూస్తే ఊరుకోం. తెలంగాణ ప్రజలకు నష్టం కలిగించే అంశాలపై మా పోరాటం కొనసాగుతుంది.'

-నామా నాగేశ్వరరావు, తెరాస లోక్‌సభ పక్షనేత

ఇదీ చదవండి:

Meeting: నేడు నీటి ప్రాజెక్టులపై భాజపా రౌండ్ టేబుల్ సమావేశం

ABOUT THE AUTHOR

...view details