DRUGS CASE: మత్తు దందాపై ప్రత్యేక దృష్టి.. ముఠాల గుట్టురట్టు తెలంగాణలోని మిర్యాలగూడ కేంద్రంగా గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న అయిదుగురు సభ్యుల ముఠాను... నల్గొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కొత్తపేటకు చెందిన నిందితులు... మిర్యాలగూడలోని ఓ వ్యక్తికి గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరందరికీ సరఫరాదారులుగా వ్యవహరించిన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సింధువాడకు చెందిన పంగి విశ్వనాథ్, అదే జిల్లా బచ్చులూరు గ్రామానికి చెందిన వేమా జాన్‌రెడ్డిని అరెస్టు చేశారు. 21 కిలోల గంజాయి సీజ్ చేశారు. గంజాయిని వీడ్ ఆయిల్‌గా విక్రయిస్తున్నారనన్న ఎస్పీ రంగనాథ్..... దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు.
రంగు రాళ్ల ముగ్గు పేరిట..
వాడపల్లి కేంద్రంగా నకిలీ గ్రాన్యూల్స్... గుళికలు తయారు చేస్తున్న కర్ణాటకలోని రాయచూరు జిల్లా సింథనూరుకు చెందిన ఏలూరి శ్రీనివాస్, హైదరాబాద్‌కు చెందిన విజయ్ శేఖర్ పోలీసులకు చిక్కారు. వీరి నుంచి రెండు వందల లీటర్ల డీఎంఎఫ్ లిక్విడ్, సింథటిక్ రంగు బస్తాలు, 38 టన్నుల గ్రాన్యూల్స్, మిల్లర్‌తోపాటు యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. రంగు రాళ్ల ముగ్గు పేరిట అక్రమంగా గుళికలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. బయో పెస్టిసైడ్స్ పేరిట వీటిని రైతులకు అంటగడుతున్నారని వివరించారు.
జిల్లాలో మత్తు పదార్థాల విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించామన్న ఎస్పీ రంగనాథ్.... ప్రజలను భాగస్వామ్యం చేస్తూ...ప్రత్యేక అవగాహన డ్రైవ్‌ను చేపడతామన్నారు.
ఇదీచూడండి:AOB: ఏవోబీలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు