ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కెనడాలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య - తెలంగాణ నేర వార్తలు

కెనడాలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గొండ జిల్లా డిండి మండలం ఆకుతోటపల్లికి చెందిన ప్రవీణ్​రావు ఇవాళ ఉదయం భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Nalgonda student commits suicide in Canada
Nalgonda student commits suicide in Canada

By

Published : Apr 1, 2021, 2:46 PM IST

తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన విద్యార్థి.. కెనడాలో ఆత్మహత్య చేసుకున్నాడు. డిండి మండలం ఆకుతోటపల్లికి చెందిన ప్రవీణ్​రావు.. ఉన్నత చదువుల కోసం 2015లో కెనడాకు వెళ్లాడు. ఇవాళ ఉదయం భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

కెనడాలో నల్గొండ జిల్లా విద్యార్థి ఆత్మహత్య

ఉదయం మిత్రుల ద్వారా తల్లిదండ్రులకు విషయం తెలిసింది. ప్రవీణ్​రావు ఆత్మహత్యకు గల కారణాలు తెలియదని కుటుంబీకులు తెలిపారు. ఉన్నత చదువులు చదివి.. గొప్పవాడు అవుతాడనుకుంటే.. ఇలా అర్థాంతరంగా వెళ్లిపోయాడని కన్నీటిపర్యంతమయ్యారు. తమ కుమారుడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్​కు రప్పించాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details