విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో.. ఎన్జీటీ (జాతీయ హరిత ట్రైబ్యునల్) ఆదేశాలను పట్టించుకోకుండా ప్రభుత్వం అక్రమ మైనింగ్ కొనసాగిస్తోందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌బాబు ఆరోపించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పినా వినకుండా.. వైకాపా ప్రభుత్వం యథేచ్ఛగా అక్రమ మైనింగ్ కొనసాగిస్తుందని విమర్శించారు. కృష్ణాజిల్లా కొండపల్లి ప్రాంతంలో రెవెన్యూ రికార్డులను తారుమారుచేసి.. అక్రమ మైనింగ్ కొనసాగిస్తున్నారన్నారు.
'ఎన్జీటీ ఆదేశాలు పట్టించుకోకుండా అక్రమ మైనింగ్' - illigal mining in andhra pradesh
రాష్ట్రంలో అక్రమ మైనింగ్ యథేచ్ఛగా జరుగుతోందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌బాబు ఆరోపించారు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో.. ఎన్జీటీ (జాతీయ హరిత ట్రైబ్యునల్) ఆదేశాలను పట్టించుకోకుండా ప్రభుత్వం అక్రమ మైనింగ్ కొనసాగిస్తోందన్నారు.
nakka anandh babu
ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు, అణిచివేతలు, దౌర్జన్యాలను బయటపెట్టి తీరుతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ మైనింగ్, మట్టి, ఇసుక, బాక్సైట్ మాఫియా పేట్రేగిపోతోందని నక్కా ఆనంద్‌బాబు ఆక్షేపించారు.
ఇదీ చదవండి: