ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉండకూడదన్నట్లుగా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు ధ్వజమెత్తారు. ప్రశ్నించే గొంతుకల్ని అక్రమంగా జైలుకి పంపేందుకే రాష్ట్రంలో ఈ చట్టాన్ని వాడుతున్నారని ఆరోపించారు. ప్రజల్లో అట్రాసిటీ చట్టం మీద చులకన భావన తీసుకొచ్చేలా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలితో చట్టం ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. చట్టం దుర్వినియోగంపై ఎస్సీ సోదరులంతా ఆలోచన చేసి సర్కారు కుట్రకోణంపై పోరాడాలని నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు. ఈ చట్టం ప్రాధాన్యత తెలియకుండా ముఖ్యమంత్రి జగన్ తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు.