సీఎం జగన్.. దళితులను అడ్డం పెట్టుకొని ఓట్లు దండుకున్నారని.. అందలం ఎక్కిన తరువాత రాజ్యాధికారం దక్కకుండా చేస్తున్నారని తెదేపా నేత నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. దళితులకు రాజ్యాధికారం దక్కితే ఎక్కడ తనను ప్రశ్నిస్తారోనన్న భయం.. జగన్‌ను వెంటాడుతోందన్నారు. పదవులను స్వప్రయోనాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఈ మేరకు బహిరంగ లేఖ విడుదల చేశారు. గడిచిన 10 నెలలుగా దళితులను నరక యాతనలకు గురి చేశారని, స్థానిక సంస్థల ఎన్నికల్లోను దళితులు నామినేషన్లు వేసేందుకు వెళుతున్నా అడ్డుపడి దాడులు చేస్తూ.. పేపర్లను చించేస్తున్నారని అన్నారు.
'దళితులకు రాజ్యాధికారం దక్కకుండా చేస్తున్నారు' - nakka anandbabu fires on ap government
ముఖ్యమంత్రి జగన్ దృష్టిలో.. పెద్దల సభకు వెళ్లటానికి దళితులు అనర్హులా అని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ప్రశ్నించారు.
ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు