కరోనా విపత్తులో ప్రజలు ఏం కోరుకుంటున్నారో పాలకులు తెలుసుకోవాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు డిమాండ్ చేశారు. "అమ్మ ఒడికి బదులు ఆక్సిజన్ ఇమ్మంటున్నారు. వసతి దీవెన వద్దు… ఆసుపత్రిలో వసతి కల్పించమంటున్నారు. నాడు-నేడు కాకుండా రేపటికి బతుకుతామనే భరోసా కల్పించమంటున్నారు. ఇంటింటికీ రేషన్ బదులు వ్యాక్సిన్ ఇమ్మంటున్నారు. సున్నా వడ్డీ బదులు సున్నా మరణాలు రేటు ఇమ్మని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబుపై కేసులు పెట్టడం ఓ ఫ్యాషన్ లా మారింది. ప్రజల కేసుల గురించి మాట్లాడుకుని ప్రభుత్వ తప్పిదాలను మర్చిపోతారనే దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నారు. తెదేపా శ్రేణులంతా కేసులకు తెగించేసి ఉన్నాం. అక్రమకేసులకు భయపడేవాళ్లెవరూ లేరు." అని ధ్వజమెత్తారు.
ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోండి: నక్కా
ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబుపై కేసులు పెట్టడం ఫ్యాషన్‌లా మారిపోయిందని తెదేపా నేత నక్కా ఆనంద్ బాబు అన్నారు. కరోనా విపత్తులో ప్రజలు ఏం కోరుకుంటున్నారో పాలకులు తెలుసుకోవాలన్నారు.
Nakka Anandbabu