తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దళితుడు ప్రసాద్ శిరోముండనం ఘటనలో అసలు దోషులను శిక్షించాలని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు. ఈ కేసులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోందని మండిపడ్డారు. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్.. వారినేపైనే దాడులు చేయిస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో రెండో తరగతి పౌరులుగా దళితులను చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లిస్తూ...అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.
శిరోముండనం కేసులో అసలు దోషులను శిక్షించాలి: నక్కా ఆనందబాబు - నక్కా ఆనందబాబు తాజా వార్తలు
శిరోముండనం కేసులో అసలు దోషులను శిక్షించాలని తెదేపా నేత ఆనందబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వమే దళితులపై దాడులు చేయిస్తోందని మాజీ మంత్రి ఆక్షేపించారు. రాష్ట్రంలో రెండో తరగతి పౌరులుగా దళితులను చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
nakka anand babu
Last Updated : Aug 14, 2020, 7:16 PM IST