తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం యన్మన్బెట్ల గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు కరోనా బారిన పడ్డారు. ఆ కుటుంబం నివసించే ఇంట్లో ఒకే గది ఉండటం వల్ల మిగతా వారికి వైరస్ సోకకుండా.. గ్రామ సర్పంచ్ కరోనా బాధితులిద్దర్ని ప్రభుత్వ పాఠశాలలో ఉంచారు.
పాఠశాల చుట్టూ నివసించే గ్రామస్తులంతా.. కరోనా బాధితులను అక్కడ ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కణ్నుంచి వెళ్లిపోమని బెదిరించారు. దిక్కుతోచని స్థితిలో కొవిడ్ రోగులు.. శ్మశానవాటికకు వెళ్లారు. వైకుంఠ ధామంలో ఎలాంటి వసతులు లేకున్నా.. బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉన్నారు. మీడియా సహకారంతో గ్రామ సర్పంచ్ గ్రామస్థులకు నచ్చజెప్పి.. వారిని తిరిగి పాఠశాలకు చేర్చారు.