sagar gates: నాగార్జున సాగర్ జలాశయానికి రాబోయే రోజుల్లో వరద ప్రవాహాన్ని ఊహించిన ఎన్నెస్పీ(నాగార్జున సాగర్ ప్రాజెక్ట్) అధికారులు జలాశయం నిర్వహణ పనులను వేగవంతం చేశారు. ప్రాజెక్ట్‌కు ఉన్న 26 క్రస్ట్ గేట్ల ఇనుప తాళ్లను రూ.77 లక్షల వ్యయంతో పాత వాటిని తొలగించి వాటి స్థానంలో కొత్తవి బిగిస్తున్నారు. ఎగువ నుండి నీటి ప్రవాహం రాక ముందే ఈ పనులు పూర్తి చేయడం కోసం రోజుకు రెండు గేట్ల చొప్పున పని పూర్తి చేస్తున్నారు.
గత ఏడాది రూ.3 లక్షల వ్యయంతో క్రస్ట్ గేట్లకు గ్రీజింగ్ పనులు, గేట్ల నుండి నీరు లీకేజీ లేకుండా రబ్బర్ సీళ్లు బిగించినట్లు ఎన్నెస్పీ అధికారులు పేర్కొన్నారు. నాగార్జున సాగర్ జలాశయం మొత్తం నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 528.30 ఆడుగులు గా ఉంది మొత్తం 312.04 టీఎంసీల సామర్థ్యం కాగా ప్రస్తుతం 164.84 టీఎంసీ లు గా ఉంది ఎగువ నుండి సాగర్ జలాశయంలోకి 1098 క్యూసెక్కుల మాత్రమే వస్తుంది. సాగర్ నుండి విద్యుత్ ఉత్పత్తి ద్వారా 1065 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతుంది.