ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భారీ వర్షాలు.. సాగర్‌ 22 గేట్లు ఎత్తి దిగువకు వరద నీరు విడుదల

Nagarjuna Sagar lifted 22 gates: భారీ వర్షాలతో నాగార్జున సాగర్‌కు వరద పోటెత్తింది. 22 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయానికి 3 లక్షల 94 వేల క్యూసెక్కుల వరద ఎగువ నుంచి వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 588 అడుగులకు చేరింది.

Nagarjuna Sagar
నాగార్జున సాగర్‌కు వరద

By

Published : Sep 9, 2022, 8:20 PM IST

Nagarjuna Sagar lifted 22 gates: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు దిగువన నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్‌ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం నిండుకుండలా మారడంతో అధికారులు 22 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు పంపిస్తున్నారు. దిగువ ప్రాంతన ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

ఎగువ నుంచి 3.94 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో జలాశయం మెుత్తం 22 గేట్లలో 18 గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తారు.మరో 4గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3 లక్షల 48వేల క్యూసెక్కుల నీరు స్పిల్ వే ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ లో ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి 33 వేల క్యూసెక్కుల నీటిని, కుడి కాల్వకు 9వేల క్యూసెక్కుల వరద నీటిని, సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయడం లేదు. మొత్తంగా సాగర్ జలాశయం నుంచి ఔట్ ఫ్లో గా 3.94 లక్షల క్యూసెక్కుల నీరు వెళుతుంది.

నాగార్జున సాగర్ జలాశయం ప్రస్తుత నీటి మట్టం 588 అడుగులు కాగా మొత్తం నీటి మట్టం 590 అడుగులుగా ఉంది. జలాశయం నిల్వ నీటి సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 306.69 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జున సాగర్ జలాశయంకు ఈసారి వరద ప్రవాహం జులై మాసంలోనే ప్రారంభం నుంచే సాగర్ జలాశయం ఆగస్టు మొదటి వారంలోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. అదే నెల 11న క్రస్ట్ గేట్లను ఎత్తారు. ఇప్పటికే దాదాపు 300 టీఎంసీల నీరు వృథా గా విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చిందని యాజమాన్యం తెలిపింది.

నాగార్జున సాగర్‌కు వరద

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details