Nagababu Reacts on Radisson Pub Incident: రాడిసన్ బ్లూ హోటల్ పబ్ డ్రగ్స్ కేసుకు.. తన కుమార్తె నిహారికకు ఎలాంటి సంబంధమూ లేదని మెగాబ్రదర్ నాగబాబు స్పష్టం చేశారు. రాత్రి తన కుమార్తె పబ్‌లో ఉన్న మాట వాస్తమేనని పేర్కొన్న నాగబాబు.. పరిమిత సమయానికి మించి పబ్ కొనసాగడం వల్ల పోలీసులు చర్యలు తీసుకున్నారని తెలిపారు. అయితే.. ఈ విషయంలో నిహారిక నుంచి ఎలాంటి తప్పూ లేదని పోలీసులు తెలిపారని వెల్లడించారు. ఈ ఘటనపై సామాజిక మాద్యమాలు, మీడియాలో ఎలాంటి అసత్య ప్రచారానికీ అవకాశం ఇవ్వకూడదనే వీడియో విడుదల చేస్తున్నట్టు చెప్పారు.
అర్ధరాత్రి పబ్‌లో నిహారిక.. వీడియో రిలీజ్ చేసిన నాగబాబు - Nagababu video relesed
Nagababu Reacts on Radisson Pub Incident: హైదరాబాద్ రాడిసన్ బ్లూ హోటల్ పబ్ ఘటనపై.. సినీనటుడు నాగబాబు స్పందించారు. డ్రగ్స్ విషయమై తన కుమార్తె గురించిన వివరాలు వెల్లడించారు.
గత రాత్రి రాడిసన్ బ్లూ పబ్ ఘటనపై నేను స్పందించడానికి కారణం నా కూతురు నిహారిక ఆ సమయానికి అక్కడ ఉండటం. పబ్ టైమింగ్స్ పరిమితికి మించి నడపడం వల్ల పోలీసులు పబ్‌పై యాక్షన్ తీసుకున్నారు. నిహారికకు సంబంధించినంత వరకు షీ ఈజ్ క్లియర్. ఇక్కడ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని చెప్పారు. సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎలాంటి అసత్యప్రచారం చేయకూడదనే నేను ఈ వీడియో రిలీజ్ చేస్తున్నా. - నాగబాబు, సినీనటుడు
ఇదీ చూడండి:పబ్‌లో పట్టుబడిన సినీ ప్రముఖులు.. జాబితాలో నిహారిక, రాహుల్ సిప్లిగంజ్