జనసేన శ్రమదానం కార్యక్రమాన్ని ఎవరూ అడ్డుకోలేరు: నాదెండ్ల - ఏపీ వార్తలు
13:27 September 30
నాదెండ్ల మనోహర్
అక్టోబర్ 2న జరిగే శ్రమదానం కార్యక్రమాన్ని ఎవరూ అడ్డుకోలేరని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ప్రభుత్యం రోడ్ల మరమ్మతులు చేయట్లేదు కాబట్టే తాము ముందుకొచ్చామని అన్నారు. సెప్టెంబరు 2, 3, 4 తేదీల్లో రోడ్ల దుస్థితిపై ఫొటోలు పోస్ట్ చేశామని, నెల రోజులైనా ప్రభుత్వం మరమ్మతులు చేయలేదన్నారు. ఇప్పుడు హడావుడిగా పవన్ కల్యాణ్ వెళ్లే ప్రాంతాలలో రోడ్లు వేస్తున్నారని మండిపడ్డారు. బద్వేల్ ఉప ఎన్నిక అభ్యర్థిపై భాజపాతో చర్చలు జరుగుతున్నాయని, ఇరు పార్టీలు ఒక అంగీకారానికి వచ్చి పార్టీ అభ్యర్థిని ఉమ్మడిగా ప్రకటిస్తామని మనోహర్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 'కొవాగ్జిన్'కు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపుపై అక్టోబర్లో నిర్ణయం!