ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్​ బాలుడి మృతి కేసులో వీడిన మిస్టరీ.. కారణం అదే! - Telangana News

Kulsumpura Boy Death Case: హైదరాబాద్​లోని కుల్సుంపురాలో బాలుడి అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. వివిధ కోనాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు... బాలుడిని కుక్కలు కరిచి చంపినట్లు నిర్ధారణకు వచ్చారు.

Kulsumpura Boy Death Case
అనుమానాస్పద మృతి కేసులో వీడిన మిస్టరీ

By

Published : May 23, 2022, 7:26 PM IST

Kulsumpura Boy Death Case: హైదరాబాద్‌లో 12 ఏళ్ల బాలుడి మృతి కేసులో మిస్టరీ వీడింది. 12ఏళ్ల బాలుడిని కుక్కలు కరిచి చంపినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది. 15 వీధి కుక్కలు ఒకేసారి దాడిచేసి... బాలుడి మెడ, తల, వీపు భాగంలో తీవ్రంగా గాయపరిచాయి. కుక్కల దాడిని ఉస్మానియా ఆసుపత్రి ఫోరెన్సిక్ బృందం ధ్రువీకరించింది. ఈ నెల 19న కుల్సుంపురాలో ఓ బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మెడ, తలపై తీవ్రగాయాలతో మూసీ ఒడ్డున మృతదేహం లభ్యమైంది.

అబ్బాయి మృతిపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు ఎవరో కత్తులతో పొడిచి చంపారని మొదట అనుమానించారు. ప్రత్యక్ష సాక్షుల వివరాలు సేకరించి భిన్న కోణాల్లో దర్యాప్తు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపించారు. ఈ పరీక్షల్లో కుక్కలదాడిలోనే బాలుడు ప్రాణాలొదిలినట్లు తేలింది. ఏప్రిల్ 27న గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండేళ్ల బాలుడు కుక్కల దాడిలో మృతిచెందాడు. కుక్కల స్వైరవిహారం చేస్తూ దాడులు చేస్తూ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఏం జరిగిందంటే..?:హైదరాబాద్ కుల్సంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో మూసీ నది తీరాన 12 ఏళ్ల బాలుడి మృతదేహం లభ్యమైంది. బాలుడి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతినడం గమనించిన స్థానికులు... పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం సిబ్బంది, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి వివరాల కోసం ఆరా తీయగా.. అతను కుల్సంపుర పరిధిలోని పంచ్ భాయ్ అలవా నివాసి సయ్యద్ సోఫియాన్ అని తెలిసినట్లు పోలీసులు వెల్లడించారు.

నాలుగో తరగతి చదువుతున్న సయ్యద్.. మే 19న ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడని అతడి తల్లిదండ్రులు తెలిపారు. ఆడుకోవడానికి వెళ్లాడని అనుకున్నామని.. ఇంతలోనే ఇలా జరుగుతుందనుకోలేదని కన్నీరుమున్నీరుగా విలపించారు. బాలుడి శరీరం మీద గాయాలు చూసిన పోలీసులు.. వీధి కుక్కలు కరవడం వల్లే చనిపోయాడమోనని అనుమానిస్తున్నారు. ఇది హత్యా.. ఆత్మహత్యా.. లేక ప్రమాదమా అనే కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details